దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా పలు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమం..
ర్యాలీ,ధర్నా, గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ..
సిద్దిపేట, అక్టోబర్,2.

దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పై, పత్రికా, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని TUWJ(IJU) సిద్దిపేట జిల్లా శాఖ డిమాండ్ చేసింది..ఇండియన్ జర్నలిస్టు యూనియన్ “సేవ్ జర్నలిజం ” పేరిట దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది..అందులో భాగంగా TUWJ (IJU) సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.. అందులో భాగంగా సిద్దిపేట లో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన ర్యాలీ నిర్వించారు.. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి ధర్నా చేశారు.. ఈ సందర్భంగా TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల,పత్రికా,మీడియా సంస్థల పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని అనుసరిస్తున్నదని అన్నారు.. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టుల పై భౌతిక దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.. దేశవ్యాప్త ఆందోళన లో భాగంగా IJU మూడు ప్రధాన డిమాండ్ల ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిందని తెలిపారు.. జాతీయ స్థాయిలో మీడియా రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని, జాతీయ స్థాయిలో మీడియా కమీషన్ ను ఏర్పాటు చేయాలని, దేశ వ్యాప్తంగా అక్రిడిటేశన్ కార్డు లు కలిగి ఉన్న జర్నలిస్టులకు రాయితీ పై రైల్వే పాస్ లు అందజేయాలని కోరిందన్నారు.. ఆ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త ఆందోళన కు పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ మే ఆడి మాండ్ల ను నెరవేర్చాలని కోరారు..జర్నలిస్టు ల హక్కుల పరి రక్షణ కు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కు , జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ చేసిన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని కోరారు.దేశ వ్యాప్తంగా జర్నలిస్టు లపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు..కనీసం విచారణ కూడా జరపడం లేదని అన్నారు.. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూతురు రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలు పత్రికా రంగానికి,మీడియా రంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు…IJU డిమాండ్ల ను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు..ఈ నిరసన కార్యక్రమం లో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పెద్ది సుభాష్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రఘునందన్, నెల్లుట్ల వెంకట రమణారావు, యాదవ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆకుల పాండు,మజ్జు, ఫయాజ్ హఫీజ్, యూసుఫ్, సీనియర్ జర్నలిస్టు కత్తుల శ్రీనివాస్ రెడ్డి, మైసా రెడ్డి, యూనియన్ జిల్లా సంయుక్త కార్యదర్శి రంగదాం పల్లి శ్రీను, సీనియర్ జర్నిస్టులు లు రామకృష్ణ,స్వామి,సతీష్,సాజిద్, కార్యవర్గ సభ్యులు జీకురు పరమేశ్వర్,పాతర్ల వెంకటేశ్వర్లు, సతీష్,స్వామి ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్టు లు మహేష్ ఐత శ్రీను, రాం రెడ్డి,రాజబాబు,ఇంద్ర శేఖర్, రాము,స్వామి,వంశీ వీడియో జర్నలిస్టు లు గిరి,వెంకట్, చందు ,ఫోటో జర్నలస్టులు బింగి శ్రీను, shr తో పాటు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టు లు పాల్గన్నారు..ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు..
This post was created with our nice and easy submission form. Create your post!