*సమస్యల పరిష్కారానికె జగనన్నకు చెబుదాం కార్యక్రమం.* *కలెక్టర్ రవి సుభాష్*
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లో జగనన్నకు చెబుదాం శుక్రవారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మొదటగా జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని సమర్పించాలని వచ్చిన ప్రజలకు సమస్యలు రిజిస్టర్ చేసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ సమస్యలు వచ్చాయో సంబంధిత అధికారులు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సమస్యలు పరిష్కారానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను 90 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. అలాగే మండల తహశిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మండలంలో పలు గ్రామాల నుండి సర్పంచులు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఆర్డీవో జయరాం, డిర్ డిఎ పిడి లక్ష్మీపతి మరియు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!