in ,

ఉపాధి హామీ లో కోటి 20 ల‌క్ష‌ల ప‌నిదినాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం

పాడేరు సెప్టెంబ‌రు 20 :  ఉపాధి హామీ కూలీల‌కు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం లో  కోటి 20 ల‌క్ష‌ల ప‌నిదినాలు క‌ల్పించాల‌ని అల్లూరి సీతారామరాజు జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ వీడియో స‌మావేశ మందిరం నుండి  22 మండ‌లాల  ఎంపిడి ఓలు,  ఉపాధిహామీ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  కోటి ప‌నిదినాలు ల‌క్ష్యాన్ని పూర్తి చేసార‌ని,  మ‌రొక 20ల‌క్ష‌ల ప‌నిదినాలు క‌ల్పించాల‌ని  సూచించారు.  ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతుల‌కు 150 రోజుల ప‌ని క‌ల్పించాల‌ని  చెప్పారు. మిగిలిన  రైతుల‌కు వంద‌రోజులు ఉపాధి ప‌ని క‌ల్పించాల‌ని పేర్కొన్నారు.టెక్నిక‌ల్ స‌హాయ‌కులు, ఫీల్డు అసిస్టెంట్లు  గ్రామంలో ప‌ర్య‌టించి   ఆధార్ సీడింగ్ చేయ‌ని కూలీల వివ‌రాలు సేక‌రించి   ఉపాధి హామీ ఎపి ఓకు   అంద‌జేసి, ఎపి ఓ  బ్యాంకు అధికారుల‌తో  మాట్లాడి కూలీల బ్యాంకు ఖాతాల‌కు  ఆధార్ లింకేజీ చేయాల‌ని  చెప్పారు.   ఉపాధి హామీ మెటీరియ‌ల్ కాంపోనెంట్ కింద కాంట్రాక్ట‌ర్ల‌కు  ముంద‌స్తు అడ్వాన్సులు చెల్లించ వ‌ద్ద‌ని అన్నారు. ప్ర‌భుత్వ నిధులు స‌క్ర‌మంగా వినియోగించాల‌ని పేర్కొన్నారు.  స్వ‌చ్ఛ మిత్రాల జీతాల‌ను చెల్లించ‌డానికి స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎంపిడి ఓల‌ను ఆదేశించారు. ఎం ఇ ఓలు, ఎటిడ‌బ్ల్యూ ఓలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి పాఠ‌శాల‌కు రాని విద్యార్దుల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. పంచాయ‌తీ కార్య‌ద‌ర్శ‌లు స‌మ‌య పాల‌న పాటించాల‌ని చెప్పారు. స‌చివాల‌యం సిబ్బంది అటెండెన్సు వివ‌రాలు ఎంపిడి ఓలు  స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు.  జ‌న‌న దృవీక‌ర‌ణ ప‌త్రాలు, మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రాలు, ఆధార్ కార్డులు జారీ చేయ‌డానికి  ల‌క్ష్యాల‌ను  నిర్దేశించిన గ‌డువులోగా పూర్తి చేయాల‌ని  స్ఫ‌ష్టం చేసారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్దిదారుల‌కు అందించ‌డానికి  ఆధార్ కార్డు త‌ప్ప‌ని స‌ర‌ని చెప్పారు. ఆధార్ లేక‌పోవ‌డం వ‌ల‌న రైతు భ‌రోసా అంద‌డం లేద‌న్నారు. అధికారులు మండ‌ల స‌ర్వ‌స‌భ్య స‌మావేశాలు త‌ప్ప‌ని స‌రిగా హాజ‌రు కావాల‌న్నారు. అధికారులు  స‌మావేశాల‌కు హాజ‌రు కాక‌పోతే ఎంపిడి ఓలు  ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.  ఈ కార్యక్ర‌మంలో   ఉపాధిహామీ ప‌థ‌కం డిబిటి మేనేజ‌ర్ న‌రేష్‌, 22 మండ‌లాల  ఎంపిడి ఓలు, ఉపాధి హామీ ఎపి ఓలు, ఎం ఇ ఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

20 రైళ్ల రద్దు…47 రైళ్ల దారి మళ్లింపు

అక్కా చెల్లెమ్మలకు అండగా జగన్ ప్రభుత్వం