*అంగన్వాడి టీచర్ల గోస…రామన్న బరోసా…….*
*అంగన్వాడీ టీచర్స్ కి మద్దతుగా నిలిచిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు…*
ముధోల్ నియోజక వర్గం తానుర్ మండల కేంద్రoలో తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ కి సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని , కనీస వేతనం రూ.26వేలు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. దేశంలో 48 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐసీడీఎస్ లో రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మంది పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్, తదితర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళన చేసిన సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో మంత్రి ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్ కి 10 లక్షలు, ఆయాకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా సెంటర్ అద్దెలు పెండింగ్లో ఉన్నాయని, మూడు నెలల పిఆర్సి ఏరియార్స్ బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని , 2017 నుండి టీఏ,డీఏ,లు ఇంక్రిమెంట్లు, ఇంచార్జ్ అలవెన్స్, పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉద్యమ తరహలో *వంట వార్పు* మొదలుకొని నేటి అంగన్వాడి టీచర్స్ల ఉద్యమ రోడ్డు పై రాస్తా రోకో నిర్వహించి, రోడ్డు పై భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అంగన్వాడీ ఉపాద్యాయులు బిజేపి నేతలు, మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]