దళిత సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న విజయవాడలో జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె. సింహాచలం పిలుపునిచ్చారు. గొల్లప్రోలులోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితపేటలోని మహిళలు వారికి యూనిట్ల లోపు వచ్చిన వారికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న చాలామందికి సబ్సిడీ రావడం లేదని, బిల్లులు 800 నుంచి 1000 లోపు కరెంట్ బిల్లులు వస్తున్నాయని, పెన్షన్ డబ్బులు వాటికి సరిపోతున్నాయన్నారు. 1977లో ప్రభుత్వమే కాలనీ ఇల్లు నిర్మించి ఇచ్చారని నేడు అవి శిథిలస్థితికి చేరుకున్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం హౌసింగ్ ద్వారా ఇచ్చే రుణం రూ.1,80,000 సరిపోవని దళితులకు రూ.ఐదు లక్షలు పెంచి ఇవ్వాలని, గొల్లప్రోలు నగర పంచాయతీ కావడంతో ఉపాధి హామీ పనులు లేవని వ్యవసాయ పనులు తగ్గడంతో పనులు లేవని, శ్మశానం ముంపునకు గురవుతోందని వివరించారు. అనంతరం కెఎస్.శ్రీనివాస్, కె. సింహాచలం మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులను ఆదిపత్య కులాలు పాలక పార్టీలకు ఓటు బ్యాంక్గా చూస్తున్నాయి తప్ప వారిని మనుషులుగా చూడడం లేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం 200కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితులకు భూపంపిణీ చేయడానికి వచ్చిన భూ చట్టాలను, 9/77 అసైన్డ్ చట్టాలను కాలరాసి దళితులకు భూమి లేకుండా చేస్తున్నారన్నారు. ఎస్సి, ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టామన్నారు. దీనిలో అందులో భాగంగానే సెప్టెంబర్ 29న విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించబోతున్నామన్నారు. ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించాలని కోరారు. దీనిలో భాగంగా జిల్లాలో దళిత రక్షణ యాత్రలో సంతకాల సేకరణ, బైక్ యాత్ర వంటి కార్యక్రమాలు ఈ నెల 14 నుంచి 25 వరకూ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏలేటి నానిబాబు, చిట్టిబాబు మహిళలు పాల్గొన్నారు.
[zombify_post]