డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల పీ.వెంకటాపురం,
కాకినాడ జిల్లా విద్యార్ధిని కుమారి దడాల జ్యోత్స్న అమెరికా లో ఐక్యరాజ్యసమితి సమావేశం లో పాల్గొనడంతో AP మాలమహానాడు సభ్యుడు సీనియర్ జర్నలిస్టు దడాల సత్తిబాబు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.ఐక్యరాజ్య సమితి సమావేశం లో పాల్గొనడం అంటే సామాన్య విషయం కాదు అలాంటిది జ్యోత్స్న పాల్గొనడం మాకు చాలా సంతోషం గా ఉంది ఇలాంటి అత్యంత విలువైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి సదా రుణపడి ఉంటామాని సత్తిబాబు తెలిపారు.దేశంలో కులం కులం మతం మతం అనే భావన ఎప్పుడు అయితే మానవుని మనసులోని హృదయంలోని నుంచి పోతుందో అప్పుడే మన దేశం బాగుపడి అగ్ర దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం మనకు ఎంతో అదృష్టం ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడం గమనార్హం అంబేడ్కర్ గారి వలనే ఈరోజు జ్యోత్స్న ప్రపంచ దేశాలలో సమావేశాలలో ముఖ్యమైన ఐక్య రాజ్య సమితి సమావేశాలలో పాల్గొనడం సద్యమైనది అందుకే అంబేడ్కర్ చెప్పినట్లు అన్నిటికంటే చదువు అతిముఖ్యమైన అంశం అని గుర్తు చేశారు.
[zombify_post]