మండలంలోని ముసిరాం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తవలస నుంచి ముసిరాం గ్రామానికి వెళ్లే రహదారిలోని ముసిరాం పెట్రోల్ బంక్ దాటిన తరువాత కల్వర్టు కింద మృతదేహం ఉన్నట్టు సమాచారం అందడంతో గురువారం సాయంత్రం ఏఎస్‌ఐ జి.రాజులు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
ముసిరాం వద్ద గుర్తు తెలియని మృతదేహం
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొత్తవలస నుంచి ముసిరాం గ్రామానికి వెళ్లే రహదారిలోని ముసిరాం పెట్రోల్ బంక్ దాటిన తరువాత కల్వర్టు కింద మృతదేహం ఉన్నట్టు సమాచారం అందడంతో గురువారం సాయంత్రం ఏఎస్‌ఐ జి.రాజులు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి ముసిరాం గ్రామానికి చెందిన వాడు కాదని వీఆర్వో మధు తెలిపాడు. మృతుని వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల లోపు ఉంటుందని, కల్వర్టు మీద కూర్చుని ప్రమాదవసాత్తు కింద పడి మృతి చెందాడా? లేదా మరేదైనా కారణంతో మృతి చెందాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుడు పంచె కట్టుకుని ఉన్నాడని వీఆర్వో తెలిపారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వీర జనార్దన్ తెలిపారు.
[zombify_post]