రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని యువకులకు సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వినూత్న అవకాశాన్ని కల్పిస్తుంది. ఆటోలు నడుపుతున్న యువకులు, బైకులు నడుపుతున్న లేదా డ్రైవింగ్ చేయాలన్న ఉత్సాహం ఉన్న యువకుల కోసం ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ మేళ ను సిరిసిల్ల జిల్లా పోలీసులు చేపడుతున్నట్లు ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు తమ యొక్క ఆధార్ కార్డును, ఏడవ తరగతి ఆపైన చదివిన పాస్ సర్టిఫికెట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే వారికి ఒక తేదీ నిర్ణయించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుందని, మండలంలోని యువకులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం మధ్యవర్తులను గాని బ్రోకర్లను గాని సంప్రదించవద్దని నేరుగా పోలీస్ స్టేషన్లో తమ వివరాలు సమర్పించినట్లయితే సులువుగా సజావుగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేటట్టు చూడడం జరుగుతుంది ఇట్టి సువర్ణ అవకాశాన్ని (శుక్రవారం) రోజు సాయంత్రం లోపు వివరాలను నమోదు చేయించుకోవాలని ఎస్సై సుధాకర్ ప్రకటన ద్వారా తెలిపారు.
[zombify_post]