పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గురువారం ప్రిన్సిపల్ మాచాని కవిత ఆధ్వర్యంలో జాతీయ హిందీ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ మన దేశ భాష అయిన హిందీని ప్రతి ఒక్కరు గౌరవించాలని చెప్పారు. చాలా దేశాలలో వాడబడుతున్న భాష మన హిందీ భాష అని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలను నిర్వహించి ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]