in ,

అల్లూరి జిల్లా లో 40 వేల ఓట్లు తొలగింపు: జిల్లా కలెక్టర్ సుమిత్

పాడేరు, అల్లూరి జిల్లా:- ఇంటింటి సర్వే ద్వారా సుమారు 40 వేల మరణించిన, నకిలీ ఓటర్లను తొలగించటం
జరిగిందని, వాటిపై అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మరణించిన డూప్లికేట్ ఓటర్లను తొలగించటం జరిగిందన్నారు.  కొత్త ఓటర్లను గుర్తించి నమోదు చేయటం, మరణించిన, నకిలీ ఓటర్లు (డూప్లికేట్స్, డబుల్ ఎంట్రీలు) తొలగింపు ప్రాధాన్యతగా ఇంటింటి సర్వే నిర్వహించామని వివరించారు.  పివిటిజి ఓటర్లపై ప్రత్యెక ద్రుష్టి సారించామన్నారు.  2.30 లక్షల మంది పివిటిజి ఓటర్లు ఉండగా 1.30 లక్షల మంది మాత్రమె నమోదయ్యారని, మిగిలిన లక్ష మందిలో 80 వేల మందిని నూతనముగా ఓటరు జాబితాలో చేర్చటం జరిగిందని కలెక్టర్ వివరించారు. వంద సంవత్సరాల పైబడి వయసు గల వారు 66 మంది ఉన్నారని, వారిని గుర్తించి చనిపోయినవారిని తొలగించటం, మిగిలిన వారి వయసు నిర్ధారించి సరి చేయటం జరిగిందని తెలిపారు.  అదనంగా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, రాజకీయ పార్టీల నుండి ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి అదనపు బూత్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పది వేల ఫిర్యాదులు అందాయని వాటిలో ఏడు వేల ఓటర్లను పరిశీలించి తొలగించటం జరిగిందని, ఇంకా 2,300 ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవలసి ఉందని కలెక్టర్ వివరించారు.  అన్ని రాజకీయ పార్టీలు వారి తరుపున బూత్ లెవల్ ఏజంట్లను నియమించుకోవాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, మాజీ శాశనసభ్యులు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, తమ పార్టీ తరుపున బూత్ లెవల్ ఏజంట్లను నియమించటం జరిగిందని, బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటినీ సర్వే చేయటం లేదని, అడిగితె దురుసుగా స్పందిస్తున్నారని, కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.  కలెక్టర్ స్పందిస్తూ అటువంటి వారిపై ఫిర్యాదు అందిస్తే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.  సవరణలో భాగంగా ఏ గ్రామ ఓటర్లను అదే గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఈ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్, వైఎస్ఆర్సిపి తరుపున ఎస్. రాంబాబు, బిజెపి తరుపున కే. రాఘవేంద్ర రావు, సిపిఐ తరుపున వి.జ్యోతి అమర్నాథ్, సిపిఐ (ఎం) తరుపున దూరు బొజ్జన్న, బిఎస్పి తరుపున ఎం. పండన్న తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బొండపల్లిలో స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు”

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఎక్కడ అంటే..!