డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి పాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాదేశం, నామట్టి కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటినుండి మట్టిని సేకరించారు. భాజపా సఖినేటిపల్లి మండల అధ్యక్షుడు చంపాటి శివరామకృష్ణ ఆధ్వర్యంలో సేకరించిన మట్టితో స్థానిక పంచాయితీ కార్యాలయంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా భాజపా మండల ఇంచార్జ్ అడబాల రాంబాబు మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్నీ గ్రామాల్లో ప్రతీ ఇంటి నుండి మట్టిని సేకరించి ఢిల్లీలోని పవిత్ర అమృత వాటిక నిర్మాణ కార్యక్రమంలో మట్టిని భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ డైరెక్టర్ మాలే శ్రీనివాస్ నగేష్, జిల్లానాయకులు పట్టపు సూర్యప్రకాశరావు, మండల కార్యదర్శి గుండుబోగుల వీరవెంకటసత్యనారాయణ, శక్తి కేంద్ర ఇన్చార్జ్ పడాల శ్రీనివాస్ , వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. .

[zombify_post]