సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ పేర్కొన్నారు గురువారం చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిశ ఫౌండర్ బి.వి.రాజు ఆదేశాలతో కళాశాల ప్రిన్సిపల్ బండి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై బాలికలపై అఘాయిత్యాలు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని మహిళా చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలన్నారు.ఆడపిల్లలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలని సూచించారు.నిర్భయ,దిశ వంటి చట్టాలు మహిళలకు రక్షణ కోసమే ఉన్నాయని తెలిపారు.ప్రతి మహిళా ధైర్యంగా ఉండాలని అన్నారు.బాలికలు ఆత్మస్థైర్యంతో సాగాలని బేలతనం పనికిరాదని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు.దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు శిరీష,సావిత్రిల నేతృత్వంలో జిల్లా కమిటీ సభ్యులు చర్ల తహసిల్దార్ రంగు రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శెట్టి ప్రసాద్,అమృతరావు, దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పూజల లక్ష్మి,, జిల్లా జాయింట్ సెక్రెటరీ మాలతి, స్పోక్స్ పర్సన్ శారద, జిల్లా కమిటీ సభ్యులు నాగమణి,మంగ,చర్ల మండల కమిటీ అధ్యక్ష్య కార్యదర్శి లు వాడపల్లి శిరీష, బొబ్బిలిపాటి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]