వ్యాధి నిరోధక టీకాలు అందించాలి
వ్యాధి నిరోధక టీకాలు శత శాతం లక్ష్యంగా పూర్తి చేయాలని పార్వతీపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు.
ఈ మేరకు ఆయన సంగంవలస, లక్ష్మీ నారాయణపురం గ్రామాల్లో వైద్య సిబ్బంది నిర్వహించిన మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వై. యోగీశ్వరరెడ్డి, సూపర్ వైజర్ పార్వతి, వైద్య సిబ్బంది ఉన్నారు.

[zombify_post]