in ,

అంగన్వాడి టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మినీ టీచర్లకు హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 10 లక్షలు హెల్పర్ కు 500000 ప్రకటించాలని మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్లు నియమిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి ఏఐటీయూసీ నాయకులు నోముల రామిరెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏఐటియుసి కమిటీ ల ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలో తొలిరోజు సమ్మెను  మండల కేంద్రంలో ప్రారంభించి మాట్లాడారు. ఆగస్టు 18వ తేదీన అంగన్వాడీ ఉద్యోగ సంఘాలతో మంత్రి సత్యవతి రాథోడ్ గారు జరిపిన చర్చలు ఇచ్చిన హామీలు వాటికి విరుద్ధంగా ఆగస్టు 25వ తేదీన మంత్రిగారు ప్రకటన జారీ చేశారని ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించినందువల్లనే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.1970 నుంచి ఐసిడిఎస్ లో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు ఎటువంటి చట్టబద్ధమైన సౌకర్యాలకు నోచుకోవటం లేదని పేర్కొన్నారు.గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.సమస్యలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సమ్మెను విచ్చిన్నం చేయటం కోసం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సిఐటియు విమర్శించింది 2018లో అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు 2017 నుంచి రావాల్సిన టిఏడిఏలను చెల్లించాలని కేంద్రం పెంచిన వేతనాల ఏరియల్ చెల్లించాలని డిమాండ్ చేశారు.కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పోషకాహారం అందించడం లేదని నెలలు తరబడి కందిపప్పు కోడిగుడ్లు తదితర సరుకులు రావటం లేదని పేర్కొన్నారు. నాణ్యమైన నిత్యవసర సరుకులు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.ఐసిడిఎస్ లో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న టీచర్ హెల్పర్ పోస్ట్ లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.సమ్మెను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఇచ్చిన చేయటానికి పాల్పడుతుందని వెంటనే నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు అత్యంత న్యాయమైన సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొరసా చిలకమ్మ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకురాలు కృష్ణవేణి కమలాదేవి గజలక్ష్మి బుచ్చమ్మ ఆదిలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ నాయకురాలు రత్నకుమారి చిన్నారి లక్ష్మి తదితరులతో పాటు మండలంలోని అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

Trending Posts
Popular Posts
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

సాగు భూములకు పట్టాలు మంజూరు చేయ్యాలి

అక్రమ ఇసుక తవ్వకాలు ఆగడం లేదు.