- భారీ ప్రదర్శన, బాబాసాహెబ్ విగ్రహం వద్ద నిరసన!
- మూతపడిన అంగన్వాడీ కేంద్రాలు!
- మద్దతు తెలిపిన సీఐటీయూ,వ్యకాస రాష్ట్ర నేతలు!
పట్టణ పుర వీధుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సత్తుపల్లి,వేంసూరు మండలాల అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కదం తొక్కారు. సీఐటీయూ, ఏఐటియుసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణతో తలపెట్టిన అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె సోమవారం మొదటి రోజు ఆందోళనలో భాగంగా స్థానిక సీఐటీయూ కార్యాలయం నుండి బాలాజీ దియేటర్, సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ మీదుగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తు వందలమంది అంగన్వాడీ అమ్మలు భారీ ప్రదర్శన నిర్వహించారు.బాబా సాహెబ్ విగ్రహం ఎదుట రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతుందoటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు మండలాలలో అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా మూత పడ్డాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు,జాజిరి శ్రీనివాస్ లు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26వేలు చొప్పున ఇవ్వాలని,పర్మినెంట్ చేయాలని,వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నాణ్యమైన పౌష్ఠికాహారం పేదలకు అందించాలని, లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, పెన్షన్, గ్రాట్యుటీ చట్టాలను అమలు చేయాలని, రిటైర్మెంట్ సమయంలో టీచర్స్ కు పది లక్షలు, ఆయాలకు ఐదు లక్షలు ఇవ్వాలని, ఎన్. ఏ.పి.యాప్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్, జిల్లా కమిటి సభ్యులు కొలికిపోగు సర్వేశ్వరరావులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రచారంలో వాటి అమలులో కీలక భూమిక పోషిస్తు, ఎన్నికల సంఘం విధులలో బిఎల్ఓ డ్యూటీలు సైతం చేస్తూ సమాజ సేవ చేస్తున్న అంగన్వాఢీల పట్ల ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని సమ్మె చేస్తున్న సంఘాల కమిటి ను వెంటనే చర్చలకు పిలిచి సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే రానున్న ఎన్నికలలో తగిన బుద్ది చెపుతారని హెచ్చరించారు. ఇతర శాఖల సిబ్బందితో భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని సహించమని తెలిపారు.కార్మికులకు, ఉద్యోగులకు సీఐటీయూ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు వి.సుశీల, పి.ఉదయశ్రీ, నేతలు ఎస్.జీవమ్మ, షకీనా, నాగేంద్ర, విజయలక్ష్మి, రామేశ్వరి, పుష్ప, శాంతకుమారి, లక్ష్మి, బూసిమ్మ, పద్మజ, లలిత, కళావతి, రాజ్యలక్ష్మి, హైమావతి, రత్న కుమారిలతో పాటు మరో 300 మంది పాల్గొన్నారు.
[zombify_post]