టెక్కలిలో టిడిపి దీక్షా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు టెక్కలిలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు దీక్షా శిబిరానికి అనుమతి తీసుకోలేదని టీడీపీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సిఐ సూర్య సూర్య చంద్రమౌళికి తోపులాటలో తలపై స్వల్ప గాయం అయింది.
[zombify_post]
