చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లిమర్లలో రాస్తారోకో
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద టిడిపి శ్రేణులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. నెల్లిమర్ల నగరపంచాయతీ టిడిపి అధ్యక్షురాలు బయిరెడ్డి లీలావతి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకోతో విజయనగరం- పాలకొండ రహదారిపై అరగంటపాటు వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
[zombify_post]
