చంద్రబాబు కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కోర్టు రిమాండ్కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా అదనపు సెక్యూరిటీని తీసుకురావడంతో పాటు, కాన్వాయ్ కోసం మరిన్ని బలగాల వాహనాలు రప్పిస్తున్నారు. మీడియాను సైతం కోర్టు పరిసరాల నుంచి దూరంగా పంపిస్తున్నారు. దీంతో కోర్టు లోపల ఏం జరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
[zombify_post]