కంచరపాలెం: ఈ నెల 11న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా-2023 నిర్వహించనున్నట్లు ప్రభుత్వ నరవ ఐటీఐ ప్రిన్సిపాల్ బి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ నరవలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ మేళా జరుగుతుందని తెలిపారు. ఐటీఐల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్ పూర్తి చేయని వారు, ఆర్ అండ్ ఏసీ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ మేళాకు అర్హులన్నారు. 15 జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు కంచరపాలెం నరవ ఐటీఐలో ఉదయం 10 గంటలకు నేరుగా బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు.
[zombify_post]