-
దిల్లీ వేదికగా 9,10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సులో తమ కళను ప్రదర్శించుకునే అరుదైన అవకాశం కరీంనగర్ కళాకారులకు దక్కింది.
ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రీ అశోక చక్ర బ్యాడ్జ్ ధరించబోతున్నారు. దాన్ని కరీంనగర్ కు చెందిన ఫిలిగ్రీ కళాకారుడు ఎర్రోజు అశోక్ రూపొందించారు. అంతే కాక సదస్సు జరిగే దిల్లీలో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది. జి ఐ ట్యాగ్ కూడా పొందిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు గతంలో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కూడా సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు జీ20 సదస్సులో ఏర్పాటు చేయబోయే స్టాల్ లో అద్భుతమైన కళారూపాలను ప్రపంచానికి చూపించే అవకాశం కరీంనగర్ కళాకారులకు దక్కింది.
అత్యంత అరుదైన కళల్లో ఒకటైన సిల్వర్ ఫిలిగ్రీ కళ దేశంలో చాలా తక్కువమంది అందిపుచ్చుకున్నారు. అయితే తెలంగాణాలోని కరీంనగర్‌కి చెందిన వారు ఈ కళపై పట్టు సాధించారు. కరీంనగర్ కళాకారులు వారసత్వంగా వచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ కళను నేటికీ పోషిస్తూ తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఇక కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి తయారుచేసిన వస్తువులు జీ20 దేశాల ప్రతినిధులు అలంకరించుకోనున్నారు. కరీంనగర్ కళాకారులు తయారు చేసిన బ్యాడ్జిలు జీ-20 దేశాల ప్రతినిధుల కోటుకు అలంకారం కానున్నాయి. కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారులు వెండితో తయారు చేసిన 200 అశోక చక్రం బ్యాడ్జిలను పంపించారు. తెలంగాణ హైండ్ క్పాప్ట్స్ విభాగం ద్వారా తొలిసారి కరీంనగర్ పిలిగ్రీకి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఇవాళ, రేపు జరగనున్న జీ20 సమ్మిట్‌కు హజరయ్యే 20 దేశాల ప్రతినిధులకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ బ్యాడ్జెస్ తొడగనున్నారు.
[zombify_post]