ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని, ఆయనకు అందరూ చేయూత అందించాలని ఆయన భార్య నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
''చంద్రబాబు నాయుడును కాపాడాలని, ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని విజయవాడ కనకదుర్గమ్మను వేడుకున్నాను'' అని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

''చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటం మీ అందరి కోసం. మీరంతా చేయిచేయి కలిపి ఈ పోరాటం దిగ్విజయం చేయాలి'' అని ఆమె అన్నారు.
చివర్లో జైహింద్, జై అమరావతి అంటూ ఆమె నినాదాలు చేశారు.
[zombify_post]