- నర్సీపట్నం: పట్టణంలో కృష్ణదేవిపేట వెళ్లే మార్గంలో రైస్ మిల్లు వద్ద మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాతయ్య రుత్తల లత్సా పాత్రుడు, అయ్యన్నపాత్రుడు తండ్రి చింతకాయల వరహాలదొర నూతన విగ్రహములను శనివారం ఆవిష్కరించారు. అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, కుమారుడు చింతకాయల రాజేష్ విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. లత్సా పాత్రుడు ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు.
[zombify_post]