నాగావళి నదిలో పెరుగుతున్న నీటి మట్టం
రెండురోజులుగా ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షం నీరుతో నాగావళినదిలో నీటిమట్టం పెరుగుతుంది. గురువారం మధ్యాహ్నంనాటికి ఆముదాలవలస నియోజకవర్గపరిధిలో ఉన్న నాగావళినదిలో ఎగువనకురిసిన వర్షాలతో నీటిమట్టం పెరుగుతున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవల్ల రానున్న 24 గంటల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటి నుండి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
[zombify_post]