తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి లబ్ది చేకూరిందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు.మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పలు కులసంఘాల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చిట్టాపూర్ గ్రామానికి చెందిన బుడిగ సంఘ సభ్యులు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే,తమ ఓట్లు అన్ని బీఆర్ఎస్ పార్టీకే వేస్తమని ఏకగ్రీవ తీర్మానం చేశారు.అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కులసంఘాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసారని అన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని తెలిపారు.
[zombify_post]