- విశాఖ నగరంలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరిలోవ ప్రాంతం లోని స్కిల్ డెవలప్మెంట్ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అరిలోవ ప్రాంతానికి చెందిన పడాల శివ ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు మణి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటీన పోలీసులు మణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[zombify_post]