in , ,

జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఆయుధంగా చేసుకోండి

సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో
ఇంజనీరింగ్ కళాశాలలో మోటివేషనల్ ప్రోగ్రాం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారాం లోని కళాశాలలో బుధవారం EAMCET-2023 కౌన్సిలింగ్, మరియు మేనేజ్ మెంట్ ద్వారా అడ్మిషన్స్  పొందిన  విద్యార్థినీ, విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయిన సందర్భముగా కళాశాల ఆడిటోరియం భవనంలో నిర్వహించిన మోటివేషనల్  ప్రోగ్రాంకు డాక్టర్.రామకిషన్ డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ (భారతదేశం) ముఖ్య అతిధిగా పాల్గొని స్వాగతోపన్యాసం చేశారు. జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఆయుధం చేసుకోండి. అది రేపు మీ గొప్ప బలం అవుతుంది. విద్య అనేది నేర్చుకోవడం.విద్య అధ్యాపకుల పర్యవేక్షణలో జరుగుతుంది. తెలివితేటలు, మేధాసంపత్తి వున్న విద్యార్థులను విద్యాలయ సమయంలో సిద్దాంతపరమైన, ఆచరణాత్మక అంశాల యొక్క వ్యూహాత్మక బోధన ద్వారా విజయవంతమైన విద్యార్ధులుగా చేస్తామని ఈ కళాశాల నుండి మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ఖచ్చితంగా ఒక అద్భుతమైన మైలురాయిగా ఉంటుందని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికులు, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద లు మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు భారతదేశంలోనూ, విదేశాలలోనూ అనేక ప్రఖ్యాత సంస్థలలో ఉన్నత స్థానాలలో వున్నారని తెలియజేయటం చాలా అనందంగా ఉంది. వారు అనేక అంశాలలో విజయవంతమయ్యారు. ప్రస్తుత విద్యార్థులందరూ విజయం సాధించి అదే ఉన్నత శిఖరానికి కూడా చేరుతారని నేను చాలా ఖచ్చితంగా అనుకుంటున్నాను. మా సాయిస్ఫూర్తి క్యాంపస్ లో ప్రతి విద్యార్థికి అపరిమితమైన అవకాశాన్ని అందిస్తుందని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను. ప్రతిభను గుర్తించడం మరియు ప్రశంసించడం కోసం మా కళాశాల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. మీ జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన సంవత్సరాలుగా ఈ నాలుగు సంవత్సరాలు వుండాలని కోరుతున్నాను. సంతోషంగా, విద్యాపరంగా నెరవేరిన ప్రమాణాలను కళాశాలలో అత్యుత్తమ ప్రతిభను కోరుకుంటున్నాను. మీ కోసం ఇది ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా నమ్ముతున్నాను. ఈ సందర్భముగా జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ&కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజున సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు మీ గ్రాడ్యుయేషన్ విద్య  పూర్తి  కాగానే తమ భవిష్యత్తును తామే నిర్ణయిoచుకొనేలా తయారు చేస్తామని చెప్పారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నాణ్యమైన విద్య కొరకై సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల మీద నమ్మకంతో అడ్మిషన్స్ పొందిన ప్రతి విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసారు. కళాశాల సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ఎ స్ కె. మీరా సాహెబ్, కళాశాల చీఫ్ కౌన్సిలర్ కె.వి జవహర్ మాట్లాడుతూ "విద్యార్ధి" అంటే అభ్యాసకుడు కళాశాల కల్పించే నాణ్యమైన వసతులను విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) విభాగాధిపతి SK.యాకూబ్ మాట్లాడుతూ విద్యార్థినీ,విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందుటకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఎంతో కష్టపడి చదవడంతో పాటు మంచి పట్టు సాధించాలని చెప్పారు.కళాశాల పరీక్షల విభాగాధిపతి P.శేఖర్ బాబు మాట్లాడుతూ యూనివవర్సిటీ ఆడకామిక్ ప్యాట్రన్ కు సంబంధించిన విషయాలను కూలంకుషంగా వివరించారు. అన్నిబ్రాంచీల విభాగాధిపతులు, డిప్లొమా డీన్ టి.రాంబాబు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ద్వారకా తిరుమలలో నేడు భారీగా వివాహాలు భారీ వర్షా కారణంగా భక్తుల కష్టాలు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిత్తలూరి ప్రసాద్