in ,

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిత్తలూరి ప్రసాద్

ఖమ్మం జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయ అవార్డుకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (సత్తుపల్లి) ప్రధానఉపాధ్యాయుడు చిత్తలూరు ప్రసాద్ ఎంపికయ్యారు. పూర్వవిద్యార్థుల సహకారంతో, దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి చేసిన కృషి, విద్యార్థుల నమోదు పెంపుదల, పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతి వారి వాట్సప్ గ్రూపులు, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల యాజమాన్య కమిటీ, తల్లిదండ్రుల సమావేశాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు అవార్డు ప్రకటించింది. పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, చింతలపాటి సత్యనారాయణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాశం వెంకటేశ్వరావు, వైస్ చైర్మన్  షేక్ ముబీనా, సభ్యులు అబ్దుల్లా, నాగుల్ మీరా, కవిత, ఆస్మా, ఆశ, ఫణి, మండల విద్యా నోడల్ అధికారి ఎన్. రాజేష్ రావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తాను చేసిన కృషిని విద్యాశాఖ అధికారులు గుర్తించి, అవార్డు కోసం దరఖాస్తు చేయనప్పటికీ తనను ఎంపిక చేయడం పట్ల ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతం, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మలకు, అవార్డు వచ్చే విధంగా సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఆయుధంగా చేసుకోండి

విద్యా వ్యవస్థ కు పునాది సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు.. తాటి పర్తి జీవన్ రెడ్డి