మందస పోలీస్ స్టేషన్ ను కాశీబుగ్గ డిఎస్పి జి. నాగేశ్వర రెడ్డి మంగళవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను, క్రైమ్ రేటు పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాశీబుగ్గ రూరల్ సీఐ శంకర్ రావు, మందస ఎస్సై వై.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]