నగదు అందజేస్తున్న నర్ర సుగుణమ్మ
సూర్యాపేట రూరల్:
మండల పరిధిలోని సోలిపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ తన భర్త కీ”శే” నర్ర రాములు జ్ఞాపకార్థంగా శుక్రవారం నాడు పదివేల రూపాయల నగదును సోలిపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారులు చదివిన పాఠశాలకు నగదును అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఉపాధ్యాయులు నేర్పిన బాటలో నడవాలని విద్యార్థులు చిన్నచిన్న ఆశలను నెరవేర్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను అధిరోహించాలని…పట్టు వదలకుండా విద్యార్థులు కష్ట పడుతూ ఇష్టంగా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
అమ్మానాన్నల, గురువుల కోరికను నెరవేర్చాలని దానికి సమాజం పూర్తిగా సహకరిస్తుందన్నారు.తన పిల్లలు చదివిన పాఠశాలకు.. విద్యార్థుల ఉపయోగార్ధము కుర్చీలకు, సౌండ్ బాక్స్ ల నిమిత్తముగా ప్రైమరీ మరియు జిల్లాపరిషత్ స్కూల్ కు గతంలో కూడా నగదును అందజేయడం తనకు సంతోషంగా వుందని తెలిపారు.
తన కుమారులు కష్టపడి చదివి ప్రయోజకులుగా మారి వారికి తోచినంత సహాయాన్ని పాఠశాలకు తిరిగి ఇవ్వడంలోనే సంతోషం ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి,ఉపేందర్,ఉప్పలయ్య,నిర్మల,రాణి,జానకి రాములు,పిఈటి నాగేశ్వర్,వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!