in ,

గ్యాస్ సబ్సిడీ నమోదు ప్రక్రియ వేగం పెంచాలి

సూర్యాపేట.

గ్యాస్ సబ్సిడీ నమోదు ప్రకీయ వేగం పెంచాలి.

రెండు రోజుల్లో పూర్తి చేయాలి.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి.

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

 మహాలక్ష్మి పథకం లో భాగంగా సబ్సిడీ గ్యాస్ నమోదు వివరాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రం, నేరేడు చర్ల  మండలం చిల్లే పల్లి గ్రామంలో చేపట్టిన గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండల పరిధిలో గల జి.పి లలో  గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలు    సరైన రీతిలో నమోదు కాకపోవడం తో  మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో ప్రతి జి.పి లో కూడా తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, జి.పి.ల ప్రత్యేక అధికారుల సమక్షంలో దరఖాస్తులో గల తప్పులను సరి చేసేందుకు చేపట్టిన ప్రత్యేక యాప్ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా అంతటా అన్ని జి.పి.లు, మున్సిపాలిటీలలో నమోదు కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గరిడేపల్లి కేంద్రం, నేరేడు చర్ల  చిల్లే పల్లి గ్రామంలో  కలెక్టర్ స్వయంగా పెండెం సైదమ్మ, దుపాటి శ్రీనివాస్ ల సబ్సిడీ నమోదు వివరాలను యాప్ లో పొందు పరిచారు. తప్పుగా నమోదు అయిన వివరాల ప్రక్రియను  రెండు రోజుల్లో  పూర్తి చేయాలని తదుపరి మండలాల వారీగా సబ్సిడీ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జి.పి.లన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రత్యేక పారిశ్యుద్య కార్యక్రమంలో అందరు పాల్గొనాలని అన్నారు.

    ఈ కార్యక్రమంలో గరిడేపల్లి తహశీల్దార్లు కవిత , ఎంపీడీఓ వనజ, నేరేడు చర్ల తహశీల్దార్ సైదులు, ఎంపీడివో శంకరయ్య  జి.పి ప్రత్యేక అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

పాఠశాలకు నగదు అందజేత

ప్రగతి ప్రదాత.. కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు