in ,

కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై నవంబర్ 8న విద్యా సంస్థల బంద్.

కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకైన వంబర్ 8న విద్యా సంస్థల బంద్(AISF-SFI-PDSU-AIYF-DYFI-PDSU-AISA-PDSO-BDSF-AIDSO)* *

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తాం, ఛత్తీస్ ఘడ్ లో మాత్రం ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటూ అమీషా ద్వంద వైఖరి ను ఖండించండి*

*విభజన హామీలు అమలు చేయాలని మోడీ

రాష్ట్ర అభివృద్ధి పట్ల బిజెపి నేతల నిర్లక్ష్యం..

కేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా రాష్ట్రాలలో తమకు అనుకూలంగా వ్యతిరేకంగా ద్వంద వైఖరి అవలంబించడం జరుగుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ కరణ చేస్తాం పార్లమెంట్ సాక్షిగా చెప్పుతూ వచ్చేనెల ఎన్నికల జరుగుతున్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృషి చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన పట్ల తమ వైఖరి ఏమిటో అర్థం అవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి:యస్. షాబీర్ భాష అన్నారు. ఆదివారం నాడు స్థానిక ఎన్. జి.ఓ భవన్  నందు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి:యస్. షాబీర్ భాష ,PDSU ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగరాజు,SFI జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు,PDSO రాష్ట్ర నాయకులు:తిరుమలేష్, PDSU జిల్లా అధ్యక్షులు :అఖండ, BDSF రాష్ట్ర కన్వినర్ :రమేష్, AIYF మండల కార్యదర్శి :అంజిత్ గౌడ్,AIDSO నాయకులు శివరాజ్ మాట్లాడుతూ అనేక పోరాటాలు 32 మంది విద్యార్థి యువజనల ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమని, దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు కార్మికులు అనేక ఉద్యమాలు చేస్తున్న పట్టించుకోవడంలేదని వచ్చే నవంబర్ 8 నాటికి కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు 1000 రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలు పాల్గొనడంతో  పాటు ఆరోజు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం  జరుగుతుందని తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పార్లమెంట్ నిర్మాణానికి కూడా ఉక్కునందించిన వంటివి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు.

 *కడపలో ఉక్కు ఫ్యాక్టరీ తోనే యువతకు ఉపాధి అవకాశాలు*

అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధి కావాలంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని దీని ద్వారానే  రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

 *26న ఆదోని లో రౌండ్ టేబుల్ సమావేశం*

కడపలో  ఫ్యాక్టరీ సాధన మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి ,యువజన, మహిళా, కార్మిక ,మేధావులతో ఆదోని పట్టణంలో  ఈనెల 26న రౌండ్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ *సమావేశంలో* AISF జిల్లా ఉపాధ్యక్షుడు:దస్తగిరి, నాయకులు, కార్తీక్, గోవర్ధన్, శివ, SFI నాయకులు :దినేష్, గౌస్, శశి, PDSU నాయకులు:నరేష్,శివలోకేష్,BDSF నాయకులు :సాయి, శీను, గిరిష్, PDSO నాయకులు :అశోక్, తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ప్రియమైన నాయుడు గారికి..!

దేవర గుట్టు..అక్కడ కర్ర నడుస్తుంది పరుగెడుతుంది