in ,

దేవర గుట్టు..అక్కడ కర్ర నడుస్తుంది పరుగెడుతుంది

*దేవర గుట్టు…అక్కడ కర్ర నడుస్తుంది…పరుగెడుతుంది…

నిప్పుల మంటతో మాట్లాడుతుంది కూడా…

అక్కడ భక్తి పవిత్రమైనది

ప్రాణాలకు సమానమైంది

అవసరమైతే ప్రాణాలను ఇస్తుంది కూడా…

అక్కడ బండారం ఓ సంజీవని

అక్కడ మంత్రం విచిత్ర చైతన్య ధ్వని

అక్కడ భక్తి ప్రపంచానికి అర్థమవని ఆధ్యాత్మిక దుని…

అక్కడంతే కర్రతో బుర్రకు తొర్రపడ్డా

కిర్రుమనకుండా

అర్రులు చాచి మరి నాలుక

*డిర్రా గోపరక్ అంటుంది…*

అక్కడంతే బయటి ప్రపంచం ఎంత మొత్తుకున్న

నెత్తుటి కోలాటాన్ని గుండెలకు హత్తుకుంటుంది

అక్కడంతే అంతుచిక్కని నమ్మకం ఉంది

గుండె గుండెలో స్వచ్ఛమైన నమ్మకం నిలువెత్తు కర్రై నాట్యమాడుతుంది…

అది

మూడభక్తో…

మూడేభక్తో…

మీకెందుకు

ఆపడం కానీపని…

అది నరనరాల్లో ప్రజ్వరిల్లే దేవరగట్టు

మల్లికార్జునుడి మహిమే ఏటా జరిగే బన్ని…

మన విశ్వాసం మనకెంతో

వారి విశ్వాసం వారికంత…

వారి భక్తికి వందనం

ఎవరికి నచ్చిన నచ్చకున్న కర్రల కోలాటం

జరగడం సహజం….

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై నవంబర్ 8న విద్యా సంస్థల బంద్.

ప్రేమ వలలో పడి…..