*UPI Payments: త్వరలో ‘హలో! యూపీఐ’.. మీ సొంత భాషలోనే అందుబాటులోకి.. కమాండ్ ఇస్తే చాలు.. ఈజీగా లావాదేవీలు..*
బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. డిజిటల్ బాటలో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) రాకతో వీధి వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అందిరికీ డిజిటల్ లావాదేవీలు చేరువయ్యాయి. విరివిగా ఖర్చు పెట్టడానికి, ప్రతి రూపాయి ప్రభుత్వానికి లెక్క తెలియడానికి ఇది ఉపకరిస్తుంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం ఈ యూపీఐ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఓ సంచలనాత్మక ఫీచర్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతం అంతా వాయిస్ కమాండ్ ఆధారంగానే ఎక్కువ పనులు స్మార్ట్ ఫోన్లలో జరుగుతున్నాయి కదా.. దానిని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా.. ఓ కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదేంటి అంటే మీ లావాదేవీని మీ సొంత భాషలోనే చెప్పి పూర్తి చేసేలా కొత్తగా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తోంది. అందుకోసం ఏఐ మద్దతు గల భాషా అనువాద ప్లాట్ ఫారం ‘భాషిణి’ని తీసుకొస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ వాయిస్ ఆధారిత సేవలను పరిచయం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస
This post was created with our nice and easy submission form. Create your post!