గురు న్యూస్ విశాఖపట్నం : కిషోర బాలికలకు మంచి ఆరోగ్యం అందించడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి విడదల రజిని గారు తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ- క్లార్క్ సంస్థ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు చేయూతగా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్ల పంపిణీ నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చొరవ నేపథ్యంలో ఆ సంస్థ నాప్‌కిన్ల పంపిణీకి ముందుకు వచ్చిందని,ఏకంగా 2.3లక్షల నాప్‌కిన్లు, 300 కేసుల వరకు డైపర్లను ఆ సంస్థ వైద్య ఆరోగ్యశాఖకు అందజేసిందని . వీటి విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుంది. విడతల వారీగా మరికొన్ని అందించేందుకు కూడా ఆ కంపెనీ అంగీకరించిందని, మంత్రి విడదల రజిని గారు అన్నారు. ఆమె మాట్లాడుతూ కిశోర బాలికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా తమ ప్రభుత్వం ప్రతి నెలా 12 లక్షల శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా అందజేస్తోందని, ఈ కార్యక్రమానికి కింబెర్లీ – క్లార్క్ సంస్థ కూడా చేయూతను అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!