గురు న్యూస్ విశాఖపట్నం : ఆరోగ్య శ్రీ అనే పథకం ప్రజలకి ఒక సంజీవని వంటిది అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశం లో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీ అనే పథకం దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప పథకం అని, శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం లో వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ లో విప్లవత్మకమైన మార్పులు చేశారు అని ఆమె అన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దేశంలో ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది అని ఆమె అన్నారు. ఆరోగ్య శ్రీ కి సంబందించి ప్రొసీజర్ ల ను 1050 నుంచి 3,257 కి పెంచం అని ఆమె అన్నారు. ఈ ఆరోగ్య శ్రీ కి తోడుగా ఆసరా పథకం కల్పించారు జగన్ మోహన్ రెడ్డి గారు, దీని ద్వారా రికవరీ కి దగ్గర లో ఉన్నా పేషెంట్ లకి 250 నుంచి 5000 వరకు దీని ద్వారా చెల్లీస్తున్నామని రజిని గారు అన్నారు. ఇప్పటి వరకు ఈ ఆరోగ్య శ్రీ పథకం కింద తమ ప్రభుత్వం లో 9 వేల 193 కోట్లు ఖర్చు చేశాం అని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా విడదల రజిని మాట్లాడుతూ ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం అని ఆమె అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!