తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఖండించాయి. ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలువురు యువకులు పేర్కొన్నారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఖండించాయి. ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలువురు యువకులు పేర్కొన్నారు. శుక్రవారం వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ‘వాయిస్ ఆప్ పేర్కొన్నారు. శుక్రవారం వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ‘వాయిస్ ఆఫ్ యూత్’ కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. యువత కదిలితే చంద్రబాబు లాంటి నాయకులను కాపాడుకోగలమని ఛానల్ ఎండీ గణపతినీడి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రానికి, దేశానికి దిశా నిర్దేశం చేసిన రాజనీతిజ్ఞుడ్ని అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయన్నారు.
ఆయన విజనరీ.. జగన్ ప్రిజనరీ
చంద్రబాబు లాంటి విజన్ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఎంతో అవసరం. ఆయన విజనరీ నాయకుడు. జగన్ ప్రిజనరీ నాయకుడు. ఇద్దరికీ మధ్య ఉన్న తేడాను రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్కు యువత మద్దతు తెలపాలి. లేదంటే రాష్ట్రం మరో బిహార్ మారిపోతుంది.
– భీశెట్టి బాబీ, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు
This post was created with our nice and easy submission form. Create your post!