గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో దీర్ఘకాలిక సమస్యలపై ప్రజలు ఏకరువు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నారు
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో దీర్ఘకాలిక సమస్యలపై ప్రజలు ఏకరవు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత అవి అయ్యాయో లేదో చూడటం లేదు. ఇందులో ప్రధానంగా విద్యుత్తు సమస్యలు ఉన్నాయి. ఆ శాఖ అధికారులేమో నిధులు లేవని పక్కన పెట్టేశారు.
నోడల్ అధికారులు సంబంధిత శాఖలకు సమస్యలు పంపిస్తుండగా వాటికి అంచనాలు రూపొందించి ఆమోదం తర్వాత పనులు చేపడుతున్నారు. ఇందుకు ఒక్కో గ్రామ లేదా వార్డు సచివాలయానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేస్తోంది. అయితే తాగునీరు, పారిశుద్ధ పనులు, లింకు రోడ్లు, మురుగు కాల్వలు పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. తదితర నిర్మాణ
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో విద్యుత్తుకు సంబంధించి 125 సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. వీటిని పరిష్కరించాలంటే రూ.3.04 కోట్లు నిధులు అవసరం. వీటిలో ఎక్కువగా విద్యుత్తు స్తంభాలు, లైన్ల మార్పు, ఆలయాలు, సామాజిక భవనాలకు అదనంగా స్తంభాలు వేయడం వంటివి ఉన్నాయి. ఇందులో చిన్నా చితకా అయిదు పనులు పూర్తి చేశారు. మిగిలిన వాటికి విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు అంచనాలతో సిద్ధమయ్యారు. ప్రభుత్వం ముందు నిధులిస్తే పనులు చేపడతామంటున్నారు. అసలే ఆర్థిక సంక్షోభంలో కాసుల కోసం కిందా మీదా పడుతున్న పరిస్థితుల్లో ముందుగా నిధులు మంజూరు చేసే ప్రసక్తే లేదని ఉన్నతాధికారు
తేల్చి చెప్పినట్లు తెలిసింది. సమస్యలు పరిష్కరించాలంటే సామగ్రి కొనుగోలు చేయాలని, నిధులు ఇవ్వకపోతే పనులు చేయలేమని విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. పాచిపెంట మండలం విశ్వనాథపురం పంచాయతీలో వీధిదీపాలకు ఏడు స్తంభాలు వేసేందుకు రూ.1,83,953 అంచనా వేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇలాంటి పనులు తక్కువే అయినా నిధుల సమస్యతో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు.
అత్యధికం ఎస్.కోటలోనే..
ఎస్.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు దృష్టికి పలు గ్రామాల నుంచి 30 వరకు సమస్యలు వచ్చాయి. ఎస్.కోట మండలంలో ఏడు | పనులకు రూ.19 లక్షలు వెచ్చించేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో దాదాపు అన్నీ అదనపు స్తంభాలు, వీధి దీపాలకు లైన్లు, రైతుల కళ్లాలకు విద్యుత్తు సదుపాయం వంటివే ఉన్నాయి. గోపాలపల్లి కూడలిలో కోనేరు వెనుక పొలాల్లోని పైడితల్లమ్మ ఆలయానికి విద్యుత్తు సదుపాయానికి పది స్తంభాలు వేయడానికి ఈపీడీసీఎల్ అధికారులు సుమారు రూ.2 లక్షలతో అంచనాలు రూపొందించారు. ముందుగా గుత్తేదారుతో పనులు ప్రారంభించేలా చేశారు. అయిదు స్తంభాలు
వేశారు. అటికీ విధుల మంజూరుపై సుపత వేశారు. అప్పటికీ నిధుల మంజూరుపై స్పష్టత రాకపోవడంతో పనులు నిలిపివేశారు. సీతారాంపురం, గోపాలపల్లి, బీకేఆర్ పురం, కొత్తూరు, వెంకటరమణపేట, వీరనారాయణం, సీతంపేటలో పనులకు రూ.19 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఈ పనులకు సంబంధించి బిల్లులపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో గుత్తేదారు వెనకడుగు వేశారు. ఇటీవల కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు ఎస్. కోట నియోజకవర్గ ప్రగతిపై సమీక్షించారు. ఈ పనుల్లో కదలిక ఎందుకు లేదని ఆరా తీసినప్పుడు అసలు విషయం తెలిసింది. దీంతో వీటిని రద్దు చేసినట్లేనని, ప్రస్తుతం తాత్కాలికంగా పక్కన
పెట్టాలని సమావేశంలో నిర్ణయించడం కొసమెరుపు.
This post was created with our nice and easy submission form. Create your post!