పాడేరు, అక్టోబర్ 6:- శుక్రవారం హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించిన
జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను విన్నపాల రూపంలో తగు పరిష్కారం కోసం కలెక్టర్ కు సమర్పించారు. రికార్డు స్థాయిలో 334 విన్నపాలు సమర్పించటం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారితో సహా జిల్లా అధికారులందరూ మండల స్థాయి స్పందనకు హాజరు కావటంతో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అందులో అధిక శాతం రెవిన్యూ భూ సమస్యలు, పంచాయతి రాజ్ రహదారులు, పించన్లు, ఉపాధి కల్పన, పోడు పట్టాల కోసం దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత చేరువగా మెరుగైన సేవలు అందించటానికి, వారి సమస్యలు అత్యంత దగ్గరగా పరిశీలించటానికి మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన వేదికగా ఉంటుందని చెప్పారు. సమస్యల పరిశ్కారానికి జిల్లా యంత్రాంగం వచ్చినందున సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో ప్రజలు విజ్ఞాపనలు సమర్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను పరిశ్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని, ప్రతి సమస్యపై ఒక విచారణ అధికారిని నియమించి సకాలంలో పరిష్కారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

*హుకుంపేట స్పందనలో అందిన కొన్ని ముఖ్య సమస్యలు :*
1.హుకుంపేట మండలం సూకూరు పంచాయతి, బిరిషింగి గ్రామంనకు చెందిన వంతల
పోట్టమ్మ తన కుమారుడు అయిన వంతల బుజ్జిబాబు (25 సంవత్సరములు)
శారీరకంగా, మానసికంగా వికలాంగుడైనందున, తన కుమారుడికి వికలాంగుల పెన్షన్
మంజూరు చేయుటకు అర్జీ సమర్పించినారు.
2.రంగశీల పంచాయతి, ఒంటిపాక గ్రామానికి చెందిన గంజాయి బాలరాజు ప్రమాదావశాత్తు రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. అతను డిగ్రీ మరియు ఐటిఐ చేశాడు. కావున ఆయనకు
ఉపాధి కల్పించాలని అర్జీ సమర్పించినారు.
3.సత్యనారాయణ స్వామి స్వయం సహాయక సభ్యురాలు కె. లక్ష్మి గత 11 నెలలుగా గర్భిణీ
స్త్రీలకు అందించే భోజనం కాంట్రాక్ట్ బిల్లు సుమారు రూ.95,220/- రాలేదని, ఐటిడిఎ ద్వారా
ఇప్పించాల్సినదిగా విజ్ఞప్తి చేశారు.
4. హుకుంపేట మండల సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ తన మండల కేంద్రంలో పారిశుధ్య
సమస్య ఎక్కువగా ఉందని, ఆరోగ్య కార్యకర్త లేనందున ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని
ఫిర్యాదు చేశారు.
5.ముంచింగిపుట్ మండలం, జోలాపుట్ పంచాయతి, కులబెరు గ్రామం కొర్ర ఉప్పమ్మ
తన కుమారుడు పుట్టిన నాటినుండి కాళ్లు, చేతులు పనిచ్యటం లేదని, మాటలు కూడా రావని పడుకోబెట్టి ఆహారం పెడుతున్నామని, వికలాంగుల పెన్షన్ ఇప్పించవలసినదిగా అర్జీ ఇచ్చారు.
6.చింతపల్లి మండలం, తాజంగి గ్రామంనకు చెందిన గుండ్ల మంగ తన కుమారుడైన గుండ్ల పండు (16 సంవత్సరాలు) వికలాంగుడు, మూగ మరియు నడవలేని స్థితిలో ఉన్నందున
తన కుమారుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయవలసినదిగా అర్జీ సమర్పించినారు.
7.ముంచింగిపుట్ మండలం, పనసపుట్టు పంచాయతి, టిక్రపడ గ్రామమునకు చెందిన
పి. సునీత పనసపుట్టు GTWA స్కూలులో అటెండర్ పోస్టుకు నియామకం కోరుతూ అర్జీ సమర్పించినారు.
8.బాకూరు గ్రామానికి చెందిన బాకూరు రామరాజు తన ఫిర్యాదు మేరకు తహసిల్దార్ పోడు భూములు సర్వే మూడు సంవత్సరాల క్రితం చేసినప్పటికీ ఇంతవరకూ తనకు పోడు పట్టా ఇవ్వనందున పట్టా ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.
9.తీగలవలస పరిధిలో 10000 జనాభా ఉన్నందున కామయ్యపేట గ్రామ పరిధిలో మినీ
ఆసుపత్రి మంజూరు చేయాలని తీగలవలస పంచాయతి ప్రజలు వినతి పత్రం సమర్పించినారు.
10.గూడ పంచాయతి, ఎల్లంగిపుట్టు గ్రామ ప్రజలు 20 ఎకరాల భూమిని ఉబ్బేటి సోములు
అనే టీచర్ ఎవరినీ వెళ్ళనీయకుండా కంచే వేశారు. తహసిల్దార్ మందలించగా
కంచె తీసి వేశాడు. కాని ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆ గ్రామా ప్రజలు ఫిర్యాదు సమర్పించినారు.
ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు సంయుక్త కలెక్టర్ జే. శివ
శ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్, తహసిల్దార్, ఎంపిడిఓ జిల్లా స్థాయి అధికారులు, హుకుంపేట మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!