గురు న్యూస్ విశాఖపట్నం : శాస్త్ర సాంకేతక ప్రగతి ప్రపంచ గతిని మార్చేసిందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రపంచ అoతరిక్ష వారోత్సవాలు-2023లో భాగంగా షార్–ఇస్రో, రఘు విద్యాసంస్థలు రఘు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను గురువారం మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఇస్రో–షార్ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు. చంద్రయాన్ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ ప్రయోగంతో భారతదేశ సాంకేతికత ఎంత గొప్పదో ప్రపంచానికి అర్థమైందని అన్నారు. చంద్రయాన్ ప్రయోగం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి జరగటం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. సైన్సు ప్రశ్నలను సంధిస్తుందని, ప్రయోగాల ద్వారా సమాధానం రా పట్టుకోవాలని మంత్రి అమర్నాథ్ అన్నారు. మూడు దశాబ్దాల కిందట కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ మాత్రమే ఉండేదని. ఇప్పుడు సెల్ ఫోన్లు ప్రపంచ గతినే మార్చేసేయని ఆయన అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ నేపథ్యంలో, ఈ రంగంలో స్పేస్ ఎంటర్ఫ్యునర్స్ అడుగు పెట్టవలసిన అవసరం ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. భవిష్యత్తులో స్పేస్ టూరిజంకు ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన అన్నారు. నేటి యువతలో మార్పు రావాలని, స్టార్టప్‌లు ప్రారంభించే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అవసరమైన సంపూర్ణ సహకారం యువతకు అందిస్తామన్నారు. గతంలో విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్‌పై ఆసక్తి చూపేవారని నేడు వైవిధ్యమైన ఉపాధి అవకాశాలను ఎంపిక చేసుకోవడం జరుగుతోందన్నారు. అదే సమయంలో యువతకు నూతన అవకాశ మార్గాలు ఏర్పడ్డాయన్నారు. మాతృభూమికి సేవ చేయాలనే తపన యువత కలిగి ఉండాలని సూచించారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దే శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఉందన్నారు. అతరిక్ష రంగంలో భారత్ ప్రస్థానం ఎంతో ఉన్నతంగా జరుగుతోందన్నారు. రానున్న దశాబ్ధకాలంలో భారత దేశం స్పేస్ ఎకానమీ 10 శాతానికి చేరుకోవాలని మంత్రి అమర్నాథ్ ఆకాంక్షవ్యక్తం చేశారు. విద్యార్థి మస్థిష్కంలో ఉద్భవించే ప్రతీ ప్రశ్న ఒక నూతన సమాధానాన్ని, ఆవిష్కరణకు నాందిగా నిలుస్తుందన్నారు. రఘు విద్యాసంస్థలు ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎస్డిఎస్సి–షార్, ఇస్రో డిప్యూటి డైరెక్టర్ జి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!