ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు హోం మంత్రి వనిత అన్నారు. గురువారం చాగల్లు మండలంలోని చంద్రవరం లో జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!