పాడేరు అక్టోబరు 4 : జిల్లాలో రూ. 8.91 కోట్ల వ్యయంతో చిరుధాన్యాల ఆహార శుధ్ది పరిశ్రమల స్థాపనకు శంకుస్ఠాపన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చవల్ విధానంలో 14 జిల్లాలో వర్చువల్‌గా 9 పరిశ్రమలకు శంకుస్థాపన,3 పరిశ్రమలకు ప్రారంభోత్సవం ఒక పరిశ్రమకు ఎం. ఓ. యు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని బుధవారం కలెక్టరేట్ నుండి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చింతపల్లి మండలంలో రూ.4.46కోట్లతోను, రూ.4.45 కోట్లతో చిరుధాన్యాల ఆహార శుధ్ది పరిశ్రమలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పరిశ్రమల నిర్మాణం పూర్తయితే వందల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్ రావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ బి.ఎస్ నంద్ ,పలువురు ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపుల రైతులు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!