విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని ఈ నెల 5 న విశాఖలో జరుగు బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో.సురేంద్ర పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా బహిరంగ సభ గోడ పత్రిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. జి .నారాయణ అద్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యోగ కార్మికులు, వెయ్యి రోజులపాటు పోరాటం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదు, దానితో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో 1150 కిలో మీటర్లు ఉక్కు రక్షణ బైక్ యాత్ర పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని,నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వలని, స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న 5వేల పోస్టులు భర్తీ చేయాలని, ప్లాంట్ నిర్వహణకు రూ.5వేల కోట్లు ఇవ్వలని డిమాండ్ చేస్తూ ప్రజల మద్దతు కోరుతూ,చైతన్యం చేస్తు విజయవంతంగా పూర్తి చేసిందని,ఉద్యోగులు,కార్మికులు,నిర్వాసిత కుటుంబాలు నిర్వహించే పోరాటానికి మద్దతుగా ఈ నెల 5 న విశాఖలో బహిరంగ సభ జరుగుతుందని దానికి ముఖ్యతిదిగా సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు, సిహెచ్.నరసిందింగ రావు, కె.లోకనాధం గారులతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొంటున్నారు, గోడ పత్రిక అవిస్కరించెడదంట్లో సీపీఎం నాయకులు కొర్ర త్రినాధ్ పి.భీమరాజు, ఎంఎం శ్రీను,శంకర్రావు, లైకోన్ పి రామదాసు కే దొంబ్ర పాల్గొన్నారు,
This post was created with our nice and easy submission form. Create your post!