దేశచరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగనన్న గొప్ప ఆలోచనలతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు చేయడానికి సాహసించలేకపోయారని కానీ మన జగనన్న పట్టుదల ధైర్యం మన నెట్ వర్క్ తో ఇది సాధ్యమవుతుందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వైద్య సిబ్బంది ప్రతి పౌరుడు ఇంటి వద్దనే ప్రముఖ సీనియర్ వైద్యులతో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చికిత్స మందులు ఈ కార్యక్రమం ద్వారా అందజేస్తున్నామని, నివారించదగిన అనారోగ్య కారణాలతో రాష్ట్రంలోని ఏ కుటుంబం బాధపడకుండా చూడడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప విశేషమని మండలంలోని ఎమ్. అలమండ గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
i
This post was created with our nice and easy submission form. Create your post!
