దేవరాపల్లి, అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్,29.
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన పరిసరాలను రూపొందించడమే లక్ష్యంగా శ్రమదాన్ కార్యకలాపాలను చేపట్టేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా (SHS) ప్రచారాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మండలంలో శ్రమదానం చేసి మురికి కాలువను శుభ్రం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల నుండి పాఠశాల విద్యార్థులు అధికారులులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తదుపరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కాఫీ విత్ క్లాప్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు కాఫీలు అందించారు, పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు, వారిని శాలువాతో ఘనంగా సత్కరించి రైస్ బ్యాగ్లను అందించారు. ఇందులో భాగంగా సంపూర్ణ స్వచ్ఛ గ్రామం ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి, పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అనే భావనను బలోపేతం చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ దివస్ (అక్టోబర్ 2)కి నాందిగా.
‘చెత్త రహిత గ్రామీణ భారతదేశం’. దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జిల్లా ఆర్డీఓ అధికారులు, వైసిపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ, ఎంపిపి కిలపార్తీ రాజేశ్వరి, జెడ్పీటీసీ కర్రీ సత్యం, పలువురు ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వాహన మిత్ర పథక లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!