అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సమావేశం మందిరంలో వాడి వేడిగా జరిగింది. సర్వసభ్య సమావేశం రెండు గంటలకు ప్రారంభమవుతాదని అందరూ తప్పక సమయానికి హాజరుకావాలని ముందుగానే ఎంపీడీవో డేవిడ్ రాజ్ ప్రకటన జారీ చేశారు. అయితే సమావేశానికి సర్పంచులు, పలు ఎంపీటీసీలు లేటుగా రావడంతో ఎంపీపీ గజ్జలపు మణికుమారి సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సమయానికి హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. సమయానికి వచ్చి ప్రజా సంక్షేమంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము సమయానికి వస్తున్నాం మీరు ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. వచ్చే సమావేశానికి అందరూ సమయానికి హాజరు కానట్లయితే దానికి సమాధానం మీరే చెప్పుకోవాలని ఆమె ఆమెచ్చరించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజలకు సేవ చేసేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో మండలాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడివో డేవిడ్ రాజ్, వైస్ ఎంపీపీ సుర్ల ఆదినారాయణ, తహసిల్దార్ ఆనంద్ రావు, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!