గురు న్యూస్ విశాఖపట్నం : నీయోజకవర్గం నుంచి వార్డులో ప్రతి ఒక్కరికి ఏ విధమైన సహాయం కావాలన్నా అండగా ఉంటామని గౌరవనీయులు,ఎంపీ, తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారు తెలిపారు. ఈమేరకు బుధవారం విశాఖ స్థానిక జీవీఎంసీ పెదజాలరి పేట ప్రాంతానికి చెందిన ఎర్రబిల్లి రాజు (38) అప్పుగర్ వాసవానిపాలెం వద్ద పాముకాటు గురైన నేపద్యంలో క్షతగాత్రున్ని కెజి హెచ్ కు వెళ్లి పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు కొంత నగదును క్షతగాత్రుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఆయనఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దని, అండగా ఉంటానని భరోసాని ఇచ్చారు.క్షతగాత్రునికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు సూచించారు. కార్యక్రములో వార్డు వైసీపీ ఇంచార్జి సూరాడ వెంకట లక్ష్మి దాస్, విశాఖ తూర్పు బిసి సెల్ అధ్యక్షుడు సూరాడ దాస్ పాల్గున్నారు
This post was created with our nice and easy submission form. Create your post!