డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ -2024 షెడ్యూల్ ను సవ రించిందని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా 26 జిల్లాల కలెక్టర్లు జిల్లా రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సవరించిన షెడ్యూల్ పై సమీక్షిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో1,641 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటికి అదనంగా1500 ఓటర్లు దాటిన చోట్ల మరియు దూర భారాలను పరిగణన లో తీసుకుని మూడు పోలింగ్ కేంద్రాలను నూత నంగా ప్రతిపాదించడం జరిగింద న్నారు .ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియకు సంబంధించి సవరించిన షెడ్యూల్ను విడుదల చేసిందని ఆ మేరకు ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు.ఆ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సారాంశ సవరణను నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సమయంలో పట్టణ పోలిం గ్ కేంద్రాలు రద్దీని తగ్గించేం దుకు గ్రేటర్ కమ్యూనిటీలో ఎక్కువ ఓటర్లు ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించాలని ఎన్నికల సంఘం సూచించిందన్నారు. కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఆయా పట్టణ ప్రాంతాల ను గుర్తించడానికి విస్తృత సర్వే నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. గ్రూప్ హౌసింగ్ సొసైటీలు మరియు ఎత్తైన రెసి డెన్షియల్ భవనాలు నివాస ఓటర్లను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయ డం కోసం వారి ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణ సౌకర్యాల ప్రాంతం, లేదా కమ్యూనిటీ హాళ్లు పాఠశాలలోగదులను, పట్టణ ప్రాంతంలోని మురికివాడల సమూహాలలో అభివృద్ధి పెరిగిన చోట కూడా ఈ కసరత్తును నిర్వహించాలని కమిషన్ సూచించిందన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 27.10. 2023 ఉంటుందని,క్లైయిమ్ లు మరియు అభ్యంతరాలను దాఖలు చేసే సమయం 27.10.2023 శుక్రవారం నుండి 09.12.2023 శనివారం వరకు ఉంటుందన్నా రు.ప్రత్యేక ప్రచార తేదీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు నిర్ణయించడం జరుగుతుం దన్నారు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల పరిష్కారానికి 26.12.2023 తేదీని నిర్ణయించా రన్నారు. ఓటర్ల జాబితా తుది ప్రచురణ 5.01.2024 శుక్రవారం ఉంటుందన్నారు. అన్నిఎక్సర్సై జులు పూర్తికాబడిన పిమ్మట పోలిం గ్ స్టేషన్‌ల యొక్క ఏకీకృత తాజా ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆమోదం కోసం పంపాలన్నారు. సవరించిన షెడ్యూల్ ను మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడంతో పాటు సవరిం చిన షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల కు లిఖితపూర్వకంగా తెలియ జేయాలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్ట్రోలర్ అధికారులు డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికా రత అధికారిని జీవి సత్యవాణి సెక్షన్ సూపరింటెండెంట్ రమణ కుమారి ఎన్నికల సిబ్బంది పాల్గొ న్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!