అసైన్డ్ భూములపై పేదలకు యాజమాన్యపు హక్కులు కల్పించడం అనేది గొప్ప వరమని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ నిర్ణయంతో పేదల జీవితాల్లో కొత్త మార్పు, వెలుగులు రాబోతున్నాయని ఆమె అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు.
అసైన్డ్ భూములపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల వారికి బాసటగా నిలుస్తూ వారికి చేయూత అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. భూములు లేని నిరుపేదలకు ఇచ్చే అసైన్డ్ భూములపై యాజమాన్యపు హక్కులు కల్పించడం అనేది చాలా గొప్ప విషయమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆమె తెలిపారు. రాష్ట్రంలో చాలామంది పేదవారికి అసైన్డ్ భూములు ఇవ్వడం జరిగింది కానీ వారి అవసరాల నిమిత్తం క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశం లేదన్నారు. 1977 అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టంలో నిబంధన వలన క్రయవిక్రయలు సాధ్యం కాలేదన్నారు. ఎటువంటి సవరణలు చేస్తే పేదవారికి ప్రయోజనాలు కలుగుతాయన్న ఆలోచనలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ మాత్యులు ధర్మాన ప్రసాదరావు, చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్ అధ్యక్షతన తాను కూడా ఇందులో భాగమై అనేక రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు కల్పించిన యాజమాన్య హక్కుల చట్టాలపై అధ్యయనం చేసిన అనంతరం 20 ఏళ్లు పాటు అసైన్డ్ భూముల్లో సాగుదారులుగా ఉన్నవారికి యాజమాన్య హక్కులు కల్పించే సవరణలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది శాసనపరమైనటువంటి నిర్ణయమే మాత్రమే కాదని న్యాయ, సాధికారత, ప్రజా శ్రేయస్సు దిశగా వేస్తున్న శక్తివంతమైన ముందడుగు అని ఆమె అభివర్ణించారు. ఈ నిర్ణయంతో అసైన్డ్ భూములున్న రైతుల జీవితాల్లో గొప్ప మార్పు, వెలుగులు రాబోతున్నాయని తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!