రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జనం మెచ్చిన పాలన అందిస్తున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారు అన్నారు. రాజోలు మండలం తాటిపాకలో ఆదివారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!