in ,

ప్రజాస్వామ్యం కోసం రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలసి పోరాడాలి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య అని జనసేన నేతలు అన్నారు. 

  • ★ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.
  • ★ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నేతృత్వంలో వచ్చిన ఇంచార్జ్ లు, నేతలు నారా బ్రాహ్మణిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. 
  • ★ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని…రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని వారు అన్నారు. 
  • *ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ…*
  • ★ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. 
  • ★ చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని…. చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు. 
  • ★ రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 
  • ★ ఈ స్థాయి విధ్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. 
  • ★ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని….గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణి అన్నారు.
  • ★ తెలుగు దేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు పై లోకేష్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు ఆమె తెలిపారు. 
  • ★ ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్న బ్రాహ్మణి…..స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 
  • *మద్దతు తెలిపిన వారిలో ముత్తా శశిధర్, తోట సుధీర్,తుమ్మల రామ స్వామి బాబు,పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్ర శేఖర్, గంటా స్వరూపా రాణీ, బత్తుల బల రామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య
  •  బాబు తదితరులు ఉన్నారు.*

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చింది చంద్రబాబు : మహసేన

దుర్గా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నగర మేయర్ దంపతులు